వైబ్రెంట్ గుజరాత్ ప్రారంభం

Sunday, January 11th, 2015, 11:56:52 AM IST


వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సు గుజరాత్ లోని గాంధి నగర్ లో ప్రారంభం అయింది. ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సదస్సులో ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్ కి మూన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీతో పాటు ఇతర దేశాలకు చెందిన నేతలు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సులో దాదాపు 17వేలకు పైగా అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మొత్తం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ సదస్సు జరుగుతుందని తెలుస్తున్నది. పెట్టుబడులు, ఆర్ధికపరమైన విధానాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. దేశవిదేశాల నుంచి ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు అవుతుండటంతో… గాంధినగర్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.