అమెరికా అభ్యర్ధనను తిరస్కరించిన ఇండియా!

Sunday, January 18th, 2015, 03:13:48 PM IST

india-aus
భారత రిపబ్లిక్ దినోత్సవం జనవరి 26కు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంగా ఒబామా వేదికపై ఉండే సమయంలో రాజ్ పధ్ రహదారిని విమాన రహిత ప్రాంతం(నో ఫ్లై జోన్)గా ప్రకటించాలని అమెరికా కోరింది. కాగా దీనిని గొంతెమ్మ కోరికగా అభివర్ణించిన కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ పధ్ ను నో ఫ్లై జోన్ గా ప్రకటించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.

ఇక రాజ్ పధ్ మార్గాన్ని విమాన రహిత రహదారిగా మారిస్తే గణతంత్ర్య దినోత్సవ వేడుకలలో యుద్ధ విమాన విన్యాసాలను రద్దు చెయ్యాల్సి వస్తుందన్న కారణంతోనే అమెరికా అభ్యర్ధనకు కేంద్రం నో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా భారత వైమానిక ప్రదర్శన లేకుండా గడిచిన ఏ రిపబ్లిక్ దినోత్సవం జరిగిన దాఖలాలు లేకపోవడంతో అమెరికా విజ్ఞ్యప్తికి కేంద్రం ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.