ఆ డీజీపీని పర్సనల్ గా కలిస్తే రేపుల గురించి చేబుతాడట..!

Thursday, December 17th, 2015, 10:18:49 AM IST

dgp
భాద్యత గల ఓ ఉన్నతాధికారి అనకూడని మాట అన్నాడు . మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రశ్నిస్తే భాద్యతారహితంగా ‘ అవంతే..వాటిని పోలీసులు కూడా ఆపలేరు’ అంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పాడు. పైగా ఆ ప్రశ్న వేసిన మహిళా జర్నలిస్టును ‘ ప్రైవేటుగా కలిస్తే ఆ రేపుల గురించి చెబుతాను’ అంటూ అసభ్యంగా మాట్లాడాడు. అతనే ఉత్తరప్రదేశ్ డీజీపీ ‘జగ్ మోహన్ యాదవ్’ .

ఇంకొక నెలలో రిటైర్ కాబోతున్న ఆయన్ను నిన్న మహిళలపై రేపులు పెరిగిపోయాయి..కారణం ఏమిటి అని ఓ మహిళా జర్నలిస్టు అడగ్గా.. ‘ రామరాజ్యంలోనూ రేపులు జరిగాయి.. ఇక్కడా జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు చాలా కామన్. ప్రతి రాష్ట్రంలోనూ అవి జరిగేవే.. వాటిని పూర్తిగా పోలీసులు కూడా అరికట్టలేరు. కావాలంటే నన్ను ప్రైవేటుగా కలువు రేపుల గురించి చెబుతాను’ అంటూ నిర్లక్ష్యమైన, అసభ్యకరమైన సమాధానం చెప్పాడు.

దీనిపై స్పందించిన ఇతర రాజకీయ పార్టీల నేతలు అతను ములాయం, కుటుంబానికి సన్నిహితుడు కావటం మూలానే అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదని, యూపీలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.