నేటి ఏపీ స్పెషల్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి బయటి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు

Thursday, May 19th, 2016, 04:44:54 AM IST


తెలుగు చిత్రపరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ ఒకరు. తెలుగు ప్రేక్షకుల చేత బన్నీ అని ముద్దుగా పిలిపించుకునే ఈ హీరో తన డ్యాన్స్, స్టైల్ తో స్టైలిష్ స్టార్ అన్న బిరుదును కూడా సొంతం చేసుకున్నారు. సినిమా ఫంక్షన్లలో తప్ప బయట పెద్దగా కనబడని ఈ స్టార్ హీరో గురించి కొన్ని నిజాలు మీకోసం…

* అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్టుగా చిరంజీవి నటించిన విజేత సినిమాలో వెండి తెరపై మొదటిసారి కనబడ్డాడు.

* చిన్నతనం నుండి అల్లు అర్జున్ జిమ్నాస్టిక్స్ బాగా నేర్చుకోవడం వల్ల చాలా ఈజీగా డ్యాన్సులు చెయ్యగలుగుతుంటాడు.

* ఒకవేళ సినిమాలో రాణించలేకపోతే వేరే రంగం వైపు వెళదామనుకుని యానిమేషన్ కోర్స్ కూడా నేర్చుకున్నాడు బన్నీ.

* కేరళలో హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు నటుడు అల్లు అర్జున్ మాత్రమే. బన్నీ నటించే ప్రతి సినిమా కన్నడలోకి రీమేక్ అవుతుంది. కేరళ అభిమానులు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తారు.

* బన్నీ డిప్రెషన్ లో ఉన్నప్పుడు మూడ్ చేంజ్ చేసుకోవడం కోసం ఫొటోగ్రఫీని హాబీగా ఎంచుకున్నాడు. బన్నీ చార్కోల్ ఆర్టిస్ట్ కూడా. చార్కోల్ తో బొమ్మలు వేయడంలో బన్నీ మంచి నేర్పరి.

* బన్నీ తన ప్రతి పుట్టినరోజుని మానసిక వికలాంగుల సమక్షంలో జరుపుకుంటుంటాడు.

* బన్నీకి పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉంది. డాక్టర్ స్పెన్సర్ రాసిన హూ మూవ్డ్ మై చీజ్ అనే బుక్ బన్నీ ఫెవరెట్ బుక్.

* తెలుగు హీరోల్లో ఆత్యదిక కమర్షియల్ యాడ్స్ చేసిన హీరో బన్నీనే. ఇతరు 7అప్, ఓఎల్ఎక్స్, కోల్గేట్, జాయలుక్కాస్, లాట్ మొబైల్స్, హీరో మోటోకార్ప్, క్లోజప్ వంటి యాడ్లలో కనిపించాడు.

* బన్నీ సుకుమార్ దర్శకత్వం వహించిన సోషల్ అవేర్నెస్ షార్ట్ ఫిలిం ‘ఐయామ్ దట్ చేంజ్’ లో నటించాడు.

* సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ బన్నీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆయన ఫేస్ బుక్ పేజ్ కు 7 మిలియన్లకు పైగా లైకులు ఉన్నాయి.