జ‌గ‌న్ ప్లాన్ వ‌ర్కౌట్ అయితే.. వైసీపీలోకి మ‌రో ఇద్ద‌రు కీల‌క నేత‌లు..?

Thursday, February 28th, 2019, 04:16:49 PM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యూహాల‌కు వైసీపీ టాప్ గేర్‌లో తూసుకుపోతుంది.

ఈ క్ర‌మంలో వైసీపీ చేరిక‌లు జోరుగా సాగుతున్నాయి. ఈ రోజు కూడా మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస‌రావు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే, వైసీపీలో ఇంకొంద‌రు నేత‌లు చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. వారిలో ముఖ్యంగా దాడి వీర‌భ‌ద్ర‌రావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే వైసీపీ నుండి త‌న‌కు పిలుపువ‌స్తుంద‌ని దాడి వీరభద్రరావు తెలిపారు. దీంతో ఏ పార్టీలో చేరాల‌న్న విష‌యం పై దాడి వీరభద్రరావు త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం అయిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి కొణ‌తాల రామ‌కృష్ణ టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో దాడి వీరభద్రరావు వైసీపీలో చేర‌డం దాదాపు ఖాయ‌మ‌ని వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి.

ఇక మ‌రోవైపు ప్ర‌కాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ హ‌యాంలో అనేక‌సార్లు ఒంగోలు ఎంపీగా గెలిచి చ‌క్రం తిప్పిన మాగుంట‌.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓట‌మి చెందారు.

అయితే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీలోనే ఉండేలా చేశారు చంద్ర‌బాబు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుండి పోటీ చేస్తే ఆయ‌న ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని ప‌లు స‌ర్వేలు తేల‌డంతో ఆయ‌న ప‌క్క చూపులు చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వైసీపీ నుండి మాగుంట శ్రీనివాసుల‌కు ఆహ్వానం అందింది. అయితే చంద్ర‌బాబు అల‌ర్ట్ అయ్యి ఆపేశార‌ని స‌మాచారం. అయితే ఆయ‌న మ‌న‌సంతా వైసీపీ వైపే ఉంద‌ని టాక్.దీంతో తాజాగా మాగుంట త‌న అనుచ‌రుల‌తో భేటీ అయ్యార‌ని, పార్టీ మార్పు పై చ‌ర్చ‌లు జ‌రిపార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మాగుంటను పార్టీలోకి తెచ్చే బాధ్య‌త వైసీపీలోని కీల‌క నేత‌కు జ‌గ‌న్ అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం.

దీంతో ఈరోజే వైసీపీ కీల‌క‌నేత మాగంటతో భేటీ అయ్యార‌ని, టిక్కెట్ హామీ కూడా ఇచ్చార‌ని స‌మాచారం. దీంతో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా వారంలోపు వైసీపీ తీర్ధం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అంచానా వేస్తున్నారు.