ఓరుగల్లు పోరుకు టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు..!

Saturday, October 31st, 2015, 03:14:10 AM IST


ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా పసునూరి దయాకర్ పేరును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా, రేసులో నిన్నటివరకూ ముందున్న రవికుమార్ ను కొన్ని కారణాల వల్ల పక్కనపెట్టినట్లు తెలుస్తుంది. దీంతో చివరి నిమిషంలో దయాకర్ పేరును సీఎం ఖరారు చేశారు.

గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డ దయాకర్.. టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలోను పాల్గొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, తెలంగాణా తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్ కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉన్నట్లు సమాచారం.