యువరాజు రోడ్డెక్కడమా?

Tuesday, May 19th, 2015, 10:58:03 AM IST


తెలంగాణ నిజామాబాద్ ఎంపీ కలవకుంట్ల కవిత మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగం సంక్షోభానికి, ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, అలాంటి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతుల కోసం రోడ్లపైకి రావడం విడ్డూరంగా ఉందని తనదైన శైలిలో విమర్శించారు. అలాగే జగిత్యాల పరిధిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, అందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డే కారణమని కవిత ఆరోపించారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో చేరాలని ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానిస్తే ఆలోచిస్తానని చెప్పకనే తన మనసులో మాట సెలవిచ్చారు. అలాగే తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి తమ నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ విశేష కృషి చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 45సంవత్సరాలు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీనే రైతుల సమస్యలకు, ఆత్మహత్యలకు ప్రధాన కారణమని కవిత తీవ్రంగా ధ్వజమెత్తారు.