చెన్నైలో తలదాచుకుంటున్న జనంతో ‘బస్టాండ్’ ఇలా..?

Friday, December 4th, 2015, 03:31:26 AM IST


చెన్నై మహానగరం ప్రస్తుతం చెరువును తలపిస్తున్న విషయం తెలిసిందే. ఆగకుండా కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా వందేళ్ళ తర్వాత చెన్నై నగరం అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే, కనీవినీ ఎరుగని విపత్తు ఒక్కసారిగా విరుచుపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు చవిచూస్తున్నారు. ముఖ్యంగా రవాణా వ్యవస్థ అయిన బస్సులు, రైళ్ళు, విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

ఈ నేపధ్యంలోనే చెన్నై మీదుగా పలు ప్రాంతాలకు వెళ్ళాల్సిన అనేక మంది ప్రయాణికులు కోయంబేడు బస్టాండ్ లో చిక్కుకుపోవడంతో, వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో.. బస్టాండ్ లోనే వారంతా తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా దొరికిన కాస్త జాగాలోనే వారంతా సర్దుకుపోతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రయాణికులు పోటీ పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుస్థితి చూస్తుంటే.. నిజంగా వాళ్ళు పడుతున్న బాధలు మనల్ని కూడా బాధ పెడుతున్నాయి.