అన్నా హజారేకు బెదిరింపు సందేశాలు!

Wednesday, March 4th, 2015, 04:38:39 PM IST

Anna-hazare
ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారేకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ పేస్ బుక్ లో బెదిరింపు సందేశాలు వచ్చాయి. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టంపై మూడు నెలల పాటు 1,100 కిలోమీటర్లు పాదయాత్ర చేయ్యబోతున్నట్లు హజారే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్ర గాంధీ ఆశ్రమం నుండి వార్ధా వరకు రామ్ లీలా ఆశ్రమం నుండి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపధ్యంలోనే అన్నా హజారేకు పేస్ బుక్ లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు సమాచారం. కాగా దీనిపై పిర్యాదు అందుకున్న ముంబై పోలీసులు కెనెడాకు చెందిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.