ఎయిర్ ఏషియా ప్రమాదంపై ‘ది మిర్రర్’ కథనం!

Sunday, February 1st, 2015, 12:08:23 AM IST


గత ఏడాది చివర్లో ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతూ మార్గం మధ్యలో జావా సముద్రంలో కుప్ప కూలిన ఎయిర్ ఏషియా విమానం సముద్రంపై దిగేంత వరకు భద్రంగానే ఉన్నట్లు ‘ది మిర్రర్’ తన కధనంలో పేర్కొంది. కాగా విమానం సముద్రంపై దిగేంత వరకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, నీళ్ళపై కొంత దూరం ప్రయాణించిన తరువాత విమానం మునిగిపోయినట్లు మిర్రర్ పత్రిక తన కధనంలో తెలిపింది. అలాగే మునగాక ముందు ఎటువంటి ప్రమాదం జరగకపోవడం వల్లనే ఈఎల్టీపై ప్రభావం లేదని ‘ది మిర్రర్’ వివరించింది. కాగా జావా సముద్రంలో మునిగిన ఎయిర్ ఏషియా ఏ320 విమానంలో ప్రయాణించిన 162మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే.