వీడియో: వారం రోజులుగా ఆ జలగ ముక్కులోనే!

Tuesday, June 12th, 2018, 12:26:50 AM IST

ఒక్కసారి జలగ పట్టింది అంటే సామాన్యంగా వదలదు. నొప్పి లేకుంటే సుఖంగా రక్తాన్ని పీల్చేయగలవు. ఎన్ని రోజులైనా అవి అంటిపెట్టుకొని ఉండగలవు. రీసెంట్ గా ఒక వ్యక్తి ముక్కులో వారం రోజులుగా జలాగా అలానే ఉండటం అందరిని షాక్ కి గురి చేసింది. ఫైనల్ గా డాక్టర్ దాన్ని తెలివిగా బయటకు తీసేశారు.

అసలు వివరాల్లోకి వెళితే.. 51 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి గత వారం నుంచి ఒముక్కులో అప్పుడపుడు రక్తం కారడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. అయితే ఓ సారి గమనించగా ముక్కులోంచి ఎదో వెళ్లినట్లు అనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.కొంత సేపటివరకు బాగా గమనించినడాక్టర్ మొదట ఎదో పురుగు ఉందని అనుకున్నారు. కానీ అతని ముక్కులోకి జలగవెళ్లిందని దాన్ని తీసే వరకు తెలియరాలేదు. ప్రస్తుతం ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.