పవన్ కు నో చెప్పిన యువనటి!

Saturday, January 31st, 2015, 06:14:21 PM IST

pawan-akshara
ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత జనాదరణ ఉన్నదన్న సంగతి తెలిసిందే. అయితే ‘పవనిజం’ అంటూ ఒక గ్రూప్ ఏర్పడేంతగా పవన్ కు భక్తులు ఉన్నారంటే ఆయనను అబిమానులు ఎంతగా ఆరాదిస్తున్నారో చెప్పనవసరం లేదు. ఇక మొన్నటి వరకు హీరోగానే తన సత్తాను చాటిన పవన్ కళ్యాన్ ఇప్పుడు తాజా ఎన్నికలలో టిడిపి-భాజపా పొత్తుకు మద్దతుగా ప్రసంగాలు చేసి రాజకీయాలలో కూడా తన హవా నిరూపించుకున్నారు. మరి అటువంటి పవన్ కళ్యాన్ తో నటించేందుకు ఒక యువనటి నో చెప్పిందట. అయితే ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అదే పచ్చి నిజం అంటున్నారు సినిమావర్గాల వారు.

వివరాలలోకి వెళితే పవన్ నటించబోయే గబ్బర్ సింగ్-2 చిత్రానికి కధానాయికగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండవ కుమార్తె అక్షర హసన్ ను అడిగారట. అయితే అందుకు ఆమె విముఖతను వ్యక్తం చేశారని తెలుస్తోంది. దానికి కారణం టాలీవుడ్ లో పవన్ ఇమేజిని దృష్టిలో పెట్టుకుని ఆరంభంలోనే అంతటి స్టార్ తో పనిచేస్తే అటుపై తన సినిమాలకు భారీ అంచనాలు పెరుగాతనే భయంతోనే అక్షర అంత మంచి ఆఫర్ ను కాదనుకున్నట్లు సమాచారం. కాగా ఈ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే.