దొరికిన మృత దేహాలు పడవ బోల్తా పడ్డ వారివి కాదట!

Monday, July 16th, 2018, 07:31:09 PM IST

మొన్న శనివారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక గ్రామా పరిధిలోని నదిలో పడవ బోల్తాపడిన ఘటన ఆ గ్రామ ప్రజలను విషాదంలో ముంచింది. కాగా పడవ మునక సమయంలో అందులో పోలిశెట్టి అనూష, సుచిత్రాల కనపడకుండా పోవడంతో వారి తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఘటన విషయం తెలుసుకున్న వారి మేనమామ, వారి వెతుకులాట కోసం రోడ్ మార్గాన వస్తుండగా దారిమద్యలో స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందండంతో ఆ కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది.

ఆ విషయం అటుంచితే, నేడు గాలింపు చర్యల్లో భాగంగా ఈతగాళ్లను నదిలో మూడు మృత దేహాలు లభ్యమయ్యాని, అయితే కంగారు పడవలసిన అవసరం లేదని, అవి మూడు గల్లంతైన వారివి కాదని అక్కడి అధికారులు చెపుతున్నారు. అయితే గల్లంతైన వారి కుటుంబసభ్యులు ఆందోళన పడవలసిన అవసరం లేదని, గాలింపు చర్యలు ముమ్మరంగా వేగంగా జారుతున్నాయని, అయితే నీటి ప్రవాహం మాత్రం అంతకంతకు పెరుగుతోందని అయినప్పటికీ వారిని గాలించి తప్పక జాడ కనుక్కుంటామని జేసి స్పష్టం చేసారు….