విమానాలు హైజాక్ అవ్వొచ్చు.. జాగ్రత్త

Sunday, January 4th, 2015, 01:41:50 PM IST


భారత్ పై ఉగ్రవాదులు కన్నేసారని… ఉగ్రవాదులు భారత్ లో ఏ రూపంలో అయినా దాడులు జరిపే అవకాశాలు ఉన్నాయని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా నిఘావర్గాలు మరో సమాచారాన్ని కూడా అందిస్తున్నాయి. భారత్ నుంచి విదేశాలకు వెళ్ళే విమానాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారని హెచ్చరించాయి. దీంతో రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు తనీఖీలు చేపట్టారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాలలో హైఎలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా, కోల్ కతా లోని ఇండియన్ ఎయిర్ లైన్స్ ఆఫీస్ కు త్రెట్ కాల్ రావడంతో ఎయిర్ లైన్స్ అప్రమత్తం అయింది. ఇక న్యూఢిల్లీ నుంచి కాబూల్ వెళ్ళే విమానాన్ని హైజాక్ చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు, అధికారులు ప్రయాణికులను క్షుణ్ణంగా తనికీ చేస్తున్నారు. గతంలో న్యూఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ కు తరలించిన విషయం తెలిసిందే.