ఐఎఫ్ఎఫ్ఐ వేడుకలో ప్రోగ్రామర్ పై లైంగిక వేదింపులు

Saturday, November 23rd, 2013, 06:26:36 PM IST


బారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక(ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రోగ్రామర్ గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందినా యువతిని ఒక సీనియర్ అధికారి లైంగికంగా వేదించినా విషయం చాలా ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. జే ఎన్ యూ విద్యార్ధి అయిన ఆమెని నవంబర్ 16వ తేదిన రాత్రి డిప్యూటి డైరెక్టర్ స్థాయి అధికారి తన పాత గోవా మెడికల్ కళాశాలకు (జీఎంసీ) పిలిపించుకొని మద్యం తాగమని కోరాడని ” తాగుదాం పద, తాగి అన్ని చేద్దాం” అని అసభ్యంగా మాట్లాడాడని చలన చిత్రోత్సవ డైరెక్టర్ శంకర్ మోహన్ కు ఆ యువతి పిర్యాదు చేసింది. అయితే ఈ విషయాన్నిఆ రోజు ఇంట్లో వారికి చెప్పగా వారు వెంటనే ఇంటికి రమ్మన్నారని దానితో తను పనికి రాజీనామా చేసి వెళ్ళిపోయానని తెలియజేసింది. ఆ యువతీ పిర్యాదుతో చలన చిత్రోత్సవ డైరెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటిని ఏర్పాటు చేశారు. వీరిలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖలో డైరెక్టర్ గా వున్న నిరుపమ కొట్రు మరో ఇద్దరు మహిళలు వున్నారు. అయితే ఆ అధికారి ఈ కమిటి ముందు ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమనిగిందని సమాచారం.