ఖమ్మం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి : కెసిఆర్

Thursday, January 8th, 2015, 05:40:22 PM IST


తెలంగాణలో ఒకేఒక్క విమానాశ్రయం ఉన్నదని, దీనికి తోడుగా తెలంగాణ జిల్లాలలో కొన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ వ్రాశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లలోని కొత్తగూడెం పరిసర ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయావలసిన అవసరం ఉన్నదని అన్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూములు అక్కడ ఉన్నట్టు ఆయన తెలిపారు. పర్యాటక పరంగా కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతున్నదని, భద్రాచలం శ్రీసీతారాముల వారిని, అలాగే, పర్ణశాలను ప్రతి ఏడాది ఎంతో మంది పర్యాటకులు సందర్శిస్తుంటారని, ఇక ఖమ్మం జిల్లాలో కనుక విమానాశ్రం ఏర్పాటు చేస్తే, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.