కూల్చివేత‌కు దొంగ‌ కార‌ణం వెతుకుతున్న‌ సీఎం!

Friday, November 4th, 2016, 11:13:44 AM IST

kcr
హైద‌రాబాద్‌లో ఇప్పుడున్న స‌చివాల‌యాన్ని కూల్చివేసి అధునాత‌న‌మైన కొత్త స‌చివాల‌యం నిర్మించాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం త‌ల‌పోస్తున్న సంగ‌తి తెలిసిందే. సాధ్య‌మైనంత తొంద‌ర‌గా ఆ ప‌నులు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అయితే ఈ ప‌నుల‌కు ఆదిలోనే హంస‌పాదు అన్న చందంగా కూల్చి వేత‌కు కార‌ణాలు చెప్పాల్సిందిగా హైకోర్టులో వ్యాజ్యం వేశారు కొంద‌రు. దాంతో అర్థాంత‌రంగా ప‌నులు వాయిదా వేయాల్సొచ్చింది. ప్ర‌స్తుతం స‌చివాల‌యం కూల్చివేత‌కు కార‌ణం ఏం చెప్పాలా? అన్న డైలెమ్మా కొన‌సాగుతోంది. వ‌చ్చే వార‌మే విచార‌ణ‌లో రీజ‌న్ చెప్పాల్సి ఉంటుంది కాబ‌ట్టి సీఎం గారికి ఏమీ పాలుపోవ‌డం లేద‌ని స‌న్నిహితులు అంటున్నారు.

వాస్తు బాలేదు అని చెప్పేస్తే కుద‌ర‌దు. అలాంటివి కోర్టులు న‌మ్మ‌వు. పోనీ బిల్డింగ్ పాత‌బ‌డిపోయింది. సేఫ్టీ కాద‌ని దాట‌వేయ‌లేరు. దీంతో బ‌ల‌మైన కార‌ణం ఏం చెప్పాలా? అన్న క‌న్ఫ్యూజ‌న్‌లో కేసీఆర్ ఉన్నారు. స‌చివాల‌యం అనుకూలంగా లేదు. కంఫ‌ర్ట్ గా లేదు… ఫైర్ సేఫ్టీ లేదు .. వంటి చిన్న చిన్న కార‌ణాలు చెప్పాల‌నుకున్నా వాటిని కోర్టు న‌మ్ముతుందా? అన్న‌ది వెయ్యి డాల‌ర్ల ప్ర‌శ్న‌. అందుకే ఓ బ‌ల‌మైన కార‌ణం వెతకండి అంటూ అధికారుల్ని సీఎం ఆదేశించారుట‌.