పవన్ కల్యాణ్ కు పోటీగా మహేష్ బాబును రంగంలోకి దింపుతున్న టీడీపీ..!

Tuesday, April 12th, 2016, 05:36:13 PM IST


నిన్న పలు టీవీ ఇంటర్వ్యూల్లో పవన్ కల్యాణ్ తన భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని స్పష్టంగా చెప్పడంతో పలు రాజకీయ పార్టీల్లో మెల్లగా ప్రకంపనలు బయలుదేరాయి. ముఖ్యంగా అధికార టీడీపీ లో అయితే పవన్ కు ప్రత్యాన్మాయం వెతుక్కునే చర్యలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో పవన్ కారణంగా టీడీపీ చాలా స్థానాల్లో మెజారిటీ స్థానాలు సాదించింది. అది కాదనలేని సత్యం. పైగా పవన్ సపోర్ట్ గా ఉంటే ఎంత బరోసాగా ఉంటుందో కూడా బాబుకు పూర్తిగా తెలుసు. కానీ పవన్ 2019 లో సపోర్ట్ చేయను.. సపరేట్ గా పోటీ చేస్తాను అనడంతో.. ఎన్ని ఓట్లు చీలుతాయో టీడీపీ అంచనా కూడా వేసేసింది.

ఎందుకంటే 2009 ఎన్నికల్లో చిరు పీఆర్పీ తో టీడీపీ ఓట్లను చీల్చి వారిని అధికారానికి దూరం చేశాడు. మళ్ళీ ఇప్పుడు పవన్ అదే పని చేసేలా ఉండటంతో టీడీపీ పవన్ కు ప్రత్యాన్మాయాన్ని వెతుక్కుంటోంది. అందుకు ఎంపీ గల్లా జయదేవ్ బావమరిది, సినీ హీరో మహేష్ బాబు ను తమ కోసం ప్రచారం చేసే విధంగా పావులు కదుపుతోంది. పైగా జూనియర్ ఎన్టీఆర్ ఎలాగో వాళ్ళ వైపే ఉండటం.. బాలకృష్ణ కూడా యాక్టివ్ గా ఉండటంతో వీరి ముగ్గురితో పవన్ లేని లోటును.. పవన్ చీల్చబోయే ఓటు బ్యాంకును పూడ్చుకోవాలనే యోచనలో ఉంది టీడీపీ. మరి వీరి వ్యూహం ప్రకారం మహేష్, ఎన్టీఆర్, బాలకృష్ణల కూటమి పవన్ ను ఎంతవరకూ ఎదుర్కుంటుందో చూడాలి.