వైసీపీ,బీజేపీ వారిని బహిరంగంగా ఉరి తీసేవాళ్ళు..టీడీపీ ఎమ్మెల్సీ.

Thursday, September 13th, 2018, 06:00:29 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేఖ పార్టీలు అయ్యినటువంటి వైసీపీ మరియు బీజేపీ నేతలు చేస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణల మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన విమర్శలతో విరుచుకు పడ్డారు. అవినీతి చేసిన వారే అవినీతి కోసం మాట్లాడుతుండడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ వై ఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్ మీద మరియు బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ మీద విరుచుకు పడ్డారు.

ముందుగా కన్నా లక్ష్మి నారాయణ గారి గురించి మాట్లాడుతూ ఆయన్ని ఆయన నిజంగా అంత నిజాయితీ పరుడు ఐతే తన ఆస్తుల మీద సిబిఐ వారి చేత విచారణ చెయ్యాలి అని అడిగే ధైర్యం ఉందా? అని అడిగారు.రాజశేఖర్ రెడ్డి గారి అవినీతిలో భాగస్వామి అయినటువంటి కేవీపీ రామ చంద్రరావు గారు అవినీతి కోసం మాట్లాడుతున్నారు,అవినీతి చేసి రాష్ట్రాన్ని దోచుకొని 15 నెలల పాటు జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారు అని, అలాగే వోల్క్స్ వెగాన్ పేరిట లేని కంపెనీని సృష్టించి డబ్బులు కాజేసిన బొత్సా సత్యన్నారాయణ గారు కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారని అన్నారు.భారతదేశంలో అందులోను ఆంధ్రరాష్ట్రం కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇలాంటి అవినీతిపరులు అందరూ బ్రతికి ఉన్నారని అదే వేరే దేశాల్లో అయితే వీరు చేసిన అవినీతులకి బహిరంగంగా ఉరి తీసేవారు అని సంచలన వ్యాఖ్యలు చేసేవారు.