పార్టీ పరిస్థితిపై ఆలోచనలో పడ్డ టీడీపీ నేతలు.. కారణం అదేనా..!

Monday, June 17th, 2019, 08:55:50 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే ఇక టీడీపీ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి మాత్రం అసలు కనిపించడంలేదు.

అయితే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుండడంతో టీడీపీ నేతలలో పెద్ద టెన్షన్ మొదలైంది. అయితే అదే కనుక జరిగితే పార్టీకి పెద్ద నష్టం జరగబోతుందని, ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోవలసి వస్తుందని అనుకుంటున్నారట. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కూడా స్థానిక ఎన్నికలలో వచ్చే ఫలితాల ఆధారంగా పార్టీ మారాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోబోతున్నారట. అయితే వచ్చే ఐదేళ్ళలో కూడా టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా కనిపించడంలేదని టీడీపీ పార్టీ నాయకులే భావిస్తున్నారట. ఈ ఎన్నికలలో వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది కాబట్టి వచ్చే ఎన్నికలలో కాస్త ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడినా 100 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇక పార్టీ మారడమే తమ రాజకీయ భవిష్యత్తుకు మంచిదని భావిస్తున్నారట చాలా మంది టీడీపీ నేతలు.