కఠినంగా శిక్షించాలి : తాప్సీ

Tuesday, November 4th, 2014, 01:49:40 PM IST

tapsee
దేశంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని.. అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని టాలివుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. ఇటువంటి వార్తలు వింటుంటే.. మనసు వేదనకు గురిఅవుతున్నదని అన్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండటంపట్ల తాప్సీ ఆవేదనను వ్యక్తిం చేశారు. అత్యాచారాలకు పాల్పడేవారికి శిక్షపడే విషయంలో ఆలస్యం అవుతుండటంతో.. అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇటువంటి అనాగరిక చర్యలు ఎక్కువగా ఢిల్లీలో జరుగుతుండటం పట్ల ఆమె దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.