యువత ఆల్కహాల్ కు బానిస అవ్వడానికి టివి యాడ్సే కారణమా..?

Thursday, January 22nd, 2015, 12:23:25 PM IST


ఒకప్పుడు మనకు సామెత ఉన్నది. మందు తాగనివాడు మనిషే కాదు. మందులో ఉండే కిక్కు మహల్ ఉంటుందా…ఒకప్పుడు పెద్దవాళ్ళకు తెలిస్తే తిడతారని లేక ఇంకేమైనా అనుకుంటారో అని చాటుగా మద్యం సేవించేవారు. కాలం మారింది. ఇప్పుడు మందు కొట్టడం ఒక ఫాషన్ అయిపొయింది. ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలు వెలిశాయి. టి కొట్టుల కంటే ముందే మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. ఇక, టివిలలో అయితే, బీర్ల గురించి బార్ల గురించి మద్యం బ్రాండ్ ల గురించి అనేక రకాలైన కలర్ ఫుల్ యాడ్స్ యువతను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
ఇక, ఈ మధ్యకాలంలో ఆల్కాహాల్ ను వినియోగించే వారిలో ఎక్కువ సంఖ్యలో యువతే ఉంటున్నారని తెలిసింది. దీనికి అసలు కారణం ఏమిటని ఈ మధ్య ఓ సర్వే నిర్వహిస్తే… అందులో తెలిసిన నిజం ఏమిటంటే… టివిలో చూపించే ఆల్కాహాల్ యాడ్స్ వల్లనే యువత ఎక్కువగా ఆల్కహాల్ కు బానిస అవుతున్నారని తేలింది. ఇక 2013లో దాదాపు 66.3% స్కూల్ ఏజ్ పిల్లలు ఆల్కాహాల్ ను తీసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. వీరంతా దాదాపుగా టీవీ యాడ్స్ వలనే, ఆల్కాహాల్ తీసుకునేందుకు ప్రయత్నించారని నివేదికలు తెలుపుతున్నాయి. ఎక్కువగా 15 నుంచి 19 సంవత్సరాల వయసుకలిగిన వారే యాడ్స్ చూసి ఆల్కాహాల్ తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలుస్తున్నది.