భారత్ X పాక్ : ఆట ఉందా లేదా.. క్రికెట్ వర్గాల్లో టెన్షన్..!

Wednesday, November 22nd, 2017, 06:43:50 PM IST

ఉగ్రవాదం, సరిహద్దు సమస్య మరియు ఇతర రాజకీయ కారణాల వలన ఇండియా, పాకిస్థాన్ ల సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రభావం ఇరుదేశాల క్రీడా అభిమానులకు అత్యంత ఇష్టమైన క్రికెట్ పై కూడా పడింది. గత కొన్నేళ్లుగా భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతున్నాయి. భవిష్యత్తులో కూడా పాక్ తో సిరీస్ లు ఆడేందుకు బీసీసీఐ ఏ మాత్రం చొరవ చూపడం లేదు. ఐసీసీ 2019 నుంచి టెస్టు ఛాంపియన్ షిప్ ని ప్రారంభించబోతోంది. ఈ నిబంధనల వలన ఇరు జట్లు ఖచ్చితంగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీనిపై చర్చించుకునేందుకు బీసీసీఐ నేడు క్రీడల మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిపి నిబంధనల ప్రకారం ప్రతి జట్టు మరో జట్టుతో స్వదేశంలోను విదేశాల్లోనూ కనీసం మూడు టెస్టు మ్యాచ్ కు ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ నిబంధలన నేపథ్యంలో పాక్ ని ఇండియాకు ఆహ్వానించాలా లేదా అనే దానిపై మంత్రి రాజవర్ధన్ తో బీసీసీఐ చర్చించనున్నట్లు తెలుస్తోంది. టెస్టు ఛాంపియన్ షిప్ మాత్రమే కాకా ద్వైపాక్షిక సిరీస్ లపై కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.