త్వరలో గౌతమి తనయ ఎంట్రీ!

Friday, February 13th, 2015, 05:29:04 PM IST

Gautami's-daught
విలక్షణ నటుడిగా సౌత్ ఇండియాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ వారసులుగా అతని ఇద్దరు కుమార్తెలు శృతి, అక్షరలు సినీ రంగంలో ప్రవేశించి ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కమల్ తో సహజీవనం చేస్తున్న ప్రముఖ నటి గౌతమి కుమార్తె సుబ్బులక్ష్మి కూడా నటిగా రాణించాలని ఉందన్న కోరికను ఇటీవలే ఆమె తల్లితో వెల్లడించారట. మరి అందుకు సరేనన్న గౌతమి హీరోయిన్ అయ్యే ముందు శృతి హాసన్ ను రోల్ మోడల్ గా తీసుకోమని, ఆమె సలహాలను పాటించమని సుబ్బులక్ష్మికి సూచించారని సమాచారం.

కాగా హీరోయిన్ కావాలనుకుంటున్న సుబ్బులక్ష్మి కోరికకు శృతి హాసన్ కూడా సంతోషించి పేరు మాత్రం మార్చుకోమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి సుబ్బును ఏ బాషలో ముందు పరిచయం చెయ్యాలన్న అంశంపై ప్రస్తుతం గౌతమి కసరత్తు చేస్తున్నారట. అయితే శృతి, అక్షర కెరీర్ మొదలు పెట్టిన బాలీవుడ్ అయితే అన్ని రకాలుగా బాగుంటుందని, అక్కడ పేరు సంపాదిస్తే తెలుగు, తమిళ రంగాలలో సినీ అవకాశాలు వాటంతట అవే వస్తాయనే అభిప్రాయంలో గౌతమి ఉన్నట్లు సమీపవర్గాలు పేర్కొంటున్నాయి.