ఆసుపత్రిలో చేరిన సోనియా

Thursday, December 18th, 2014, 11:56:49 PM IST


ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధి అనారోగ్యంతో న్యూ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమె ప్రస్తుతం శ్వాసకోశ సంబందిత వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల మార్గంలో ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాసతీసుకోవండం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలియజేశాయి. గతంలో క్యాన్సర్ బారిన పడిన సోనియా అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కాగ, ఇప్పుడు సోనియా శ్వాసకోశ వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పరిస్తితి సాధారణంగానే ఉన్నట్టు సమాచారం.