డిక్టేటర్ ను బీట్ చేసిన సోగ్గాడు..!

Saturday, January 23rd, 2016, 10:48:46 AM IST

nagarjuna
ఈ సంక్రాంతి రోజున నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగింటిలో ఎన్టీయార్ నాన్నకు ప్రేమతో.. బాలకృష్ణ డిక్టేటర్ ల మధ్యే పోటీ ఎక్కువగా ఉండటంతో.. మిగతా రెండు సినిమాలైన సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలకు థియేటర్స్ తక్కువగా దొరికాయి. అయితే, మొదటి నుంచి సినిమాపై నమ్మకం పెట్టుకున్న బంగార్రాజు తక్కువ థియేటర్స్ దొరికినా రిలీజ్ చేయాలని భావించి రిలీజ్ చేశారు. ఇక సోగ్గాడే చిన్ని నాయనలోని బంగార్రాజు క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలవడంతో పాటు పాత నాగార్జున అందులో కనిపించి ఔరా అనిపించాడు. రొమాంటిక్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రతిఒక్కరిని ఆకట్టుకున్నది.

దీంతో సినిమా హిట్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్ల విషయంలోను ఈ సినిమా దూసుకుపోతున్నది. సినిమా బాగుంది అని తేలడంతో.. కలెక్షన్లు తక్కుగా ఉన్న థియేటర్స్ లోని సినిమాలను ఎత్తివేసి.. సోగ్గాడే చిన్నినాయన సినిమాను ప్రదర్శిస్తున్నారు. మొదట 450 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సోగ్గాడు.. తరువాత అదనంగా మరో 150 స్క్రీన్స్ ప్రదర్శిస్తున్నారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా బాలకృష్ణ డిక్టేటర్ ను దాటేశాడు. ఇక ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 22.80 కోట్లు కలెక్ట్ చేసింది. సోగ్గాడే చిన్ని నాయన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సీడెడ్ – 3.42కోట్లు
వైజాగ్ – 1.38 కోట్లు
గుంటూరు – 1.83 కోట్లు
ఈస్ట్ – 2.36 కోట్లు
వెస్ట్ – 1.12 కోట్లు
నెల్లూరు – 0. 98 కోట్లు
కృష్ణ – 1.45 కోట్లు
తెలంగాణ – 5.66 కోట్లు
కర్ణాటక – 1.15 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 0.35 కోట్లు
ఓవర్సీస్ – 3.10 కోట్లు

ఇక ఇప్పుడు వీకెండ్ కావడంతో పాటు తెలుగు సినిమాలు ఏవీ కుడా ఈ వారం విడుదల కాకపోవడంతో.. ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.