స్టార్ క్రికెటర్ గదిలో అత్యాచారం.. కెరీర్ ప్రశ్నార్ధకం?

Tuesday, July 24th, 2018, 03:33:33 PM IST

గత కొంత కాలంగా శ్రీలంక జట్టు సామర్థ్యం చాలా వరకు తగ్గిందనే కామెంట్స్ వస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్లు వెళ్లిపోయిన తరువాత ఇప్పుడున్న వారిలో ఏ ఒక్కరు అంతగా రాణించడం లేదు. ఇకపోతే రీసెంట్ గా లంక ఓపెనర్‌ ధనుష్క గుణతిలకాపై ఎవరు ఊహించని వేటు పడింది. శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు ఆడనివ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడం ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు కారణం గుణతిలక స్నేహితుడు అమ్మాయిపై లైంగికదాడి చేసినట్లు ఆరోపణలు రావడం.

అసలు వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో గుణతిలక స్నేహితుడితో కలిసి ఒక హోటల్ లో బస చేశాడు. అయితే అతని స్నేహితుడు ఇద్దరి నార్వే మహిళలను గదిలోకి తీసుకొచ్చినట్లు.. అందులో ఒక యువతిపై అత్యాచారం జరిపినట్లు పోలీసులకు పిర్యాదు అందింది. ఇంటర్నేషనల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. దీంతో వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించి గుణతిలకపై సప్సెన్షన్ వేటు వేసింది. అతని రూమ్ లో స్నేహితుడు తప్పు చేసినందున ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడన్న కారణంతో గుణతిలకపై వేటు వేశారు. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ ఆరోపణలు నిజమైతే గుణతిలక కెరీర్ ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.