ఆ నటుడు బీజేపీకి తలనొప్పిగా మారాడు

Thursday, January 7th, 2016, 03:29:55 PM IST


బిహార్ ఎన్నికల తరువాత బీజేపీలో రాజకీయ చీలికలు ఏర్పడ్డాయి. అసంతృప్తి నేతలంతా ఒక వైపుకు చేరిపోయారు. అద్వాని నుంచి నిన్న మొన్నటి కీర్తి ఆజాద్ వరకూ అందరూ ఏదో విధంగా బీజేపీని దుయ్యబడుతూనే ఉన్నారు. తాజాగా ఇదే కోవలోకి మరో బీజేపీ నేత చేరారు. అతనే లోక్ సభ సభ్యుడు ‘శత్రుఘ్న సిన్హా’.

బీహార్ ఎన్నికల సమయం నుండే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, వ్యవహరిస్తూ ఉన్న శత్రుఘ్న సిన్హా రోజు రోజుకీ డోస్ పెంచుతూ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాడు. దీంతో బీజేపీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకుంటుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన ఆయన దమ్ముంటే నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయండి. ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడండి అంటూ సవాల్ చేశారు. అంతేగాక తాజాగా ఆయన తన జీవిత చరిత్ర ‘Anything but khamosh’ అన్న పుస్తకాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఆ పుస్తకంలో బీజేపీ పై ఆయన ఏమైనా వ్యాఖ్యలు చేసుంటే అవి ఎంతవరకు దారితీస్తాయోనని బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.