ఆస్ట్రేలియా ఓపెన్ లో సెరెనా ఘన విజయం!

Saturday, January 31st, 2015, 05:37:48 PM IST


ఆస్ట్రేలియాలో ఓపెన్ లో అమెరికా నల్ల కలువ సెరెనా విలియం ఘన విజయం సాధించింది. కాగా మొదటి ర్యాంకర్ సెరెనా విలియమ్స్, రెండో ర్యాంకర్ మారియా షెరపోవాల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో సెరెనా వరుస సెట్లలో ప్రత్యర్ధిని ఓడించింది. ఇక తొలి సెట్ ను 6-3 తేడాతో గెలుచుకున్న సెరెనా రెండో సెట్ లో మాత్రం కొంత శ్రమపడాల్సి వచ్చింది. ఇక ఆ సెట్ లో 6-6తో మ్యాచ్ టై కావడంతో మారధాన్ టైబ్రేకర్ నడిచింది. కాగా అందులో ప్లేయర్స్ ఇద్దరూ హోరాహోరీగా తలపడగా 7-5 తేడాతో సెరెనా విలియమ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఇక ఈ విజయంతో సెరెనా తన కెరీర్ లో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను దక్కించుకోగలిగింది.