ఇకపై 2,4 శనివారాలు బ్యాంకులకు పూర్తి సెలవు!

Tuesday, February 24th, 2015, 11:01:35 AM IST

bank
ప్రభుత్వం రంగ బ్యాంకులకు ఇకపై 2 మరియు 4వ శనివారాలు సెలవు దినాలు కానున్నాయి. కాగా ఈ రెండు రోజులను సెలవుల్లో కలిపేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం అన్ని బ్యాంకులు శనివారం ఒక్కపూట మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్న నేపధ్యంలో కొత్తగా జరిగిన ఒప్పందం ప్రకారం నెలలో 1,3, ఏదైనా 5వ శనివారం అదనంగా వస్తే ఆ రోజు బ్యాంకులు పూర్తి దినాలు పనిచేస్తాయి. ఇక అందుకు బదులుగా 2,4 శనివారాలు పూర్తి సెలవులు తీసుకోనున్నాయి. అలాగే దీనితో పాటు ఉద్యోగుల వేతనాలను 15% పెంచే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనితో ఈనెల 25వ తేదీ నుండి 4 రోజులపాటు జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విరమించినట్లుగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.