అన్నింటికీ ఒకే సమాధానం ఇస్తున్న సండ్ర!

Friday, July 10th, 2015, 11:22:54 AM IST


తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్ట్ చేసిన ఏసీబీ, కోర్టు అనుమతితో గురువారం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఏసీబీ అధికారులు సండ్రను నిన్న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారించి సుమారు 70 ప్రశ్నల వరకు అడిగారట. అయితే అన్ని ప్రశ్నలకు సండ్ర నుండి సమాధానం మాత్రం దాదాపు ఒకలాగే వచ్చిందట. ఇక మెజారిటీ ప్రశ్నలకు సండ్ర తనకేమీ తెలియదనే సమాధానాన్ని మాత్రమే చెప్పారని సమాచారం తెలుస్తోంది.

అలాగే తనొక ఎమ్మెల్యేనని, తనకి రోజుకు చాలా ఫోన్లు వస్తుంటాయని, అందులో సగం మందిని చూస్తేగాని గుర్తుపట్టలేనని సండ్ర తెలిపారట. ఇక ఓటుకు నోటు వ్యవహారంపై తనకేమీ తెలియదనే సండ్ర వాదించినట్లు తెలుస్తోంది. కాగా నేడు జరిగే రెండో రోజు విచారణలో సండ్ర నుండి సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.