వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్ఎక్స్100 టీం వెరైటీ థాట్!

Monday, August 20th, 2018, 06:00:51 PM IST

కేరళలో కురిసిన అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదలకు అక్కడి ప్రజలు అల్లల్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశానుసారం రాష్ట్రం మొత్తం రక్షణ మరియు సహాయక బృందాలు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన అక్కడి ప్రజలను చాలావరకు రక్షణ కల్పించి కాపాడడం జరిగింది. అంతేకాదు పలు రాష్ట్రాలనుండి ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు, విదేశాల నుండి పలువురు ఎన్నారైలు సైతం వరద బాధితులకు విరివిగా విరాళాలు ఇస్తున్నారు. ఇక టాలీవుడ్ నుండి కూడా చాలా మంది ప్రముఖులు వరద బాధితులను ఆదుకోవడానికి ఆపన్న హస్తం అందించి ముందుకు వచ్చారు.

ఇకపోతే ఇటీవల చిన్న సినిమాగా విడుదలయి పెద్ద విజయాన్ని అందుకున్న ఆర్ఎక్స్100 చిత్ర యూనిట్, కేరళ వరద బాధితులకు వినూత్నంగా విరాళాన్ని సేకరించి వారికీ అందించనుంది. ఈ చిత్రంలో వాడిన యమహా బైక్ ని వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మును వరద బాధితుల సహాయార్ధం ఇవ్వనుంది చిత్ర యూనిట్. అందుకోసం యూనిట్ ప్రధమంగా బైక్ ధరను రూ.50,000 మినిమం బిడ్డింగ్ ధరగా నిర్ణయించారు. ఎవరయితే ఈ వేలంలో పాల్గొని బైక్ దక్కించుకోవాలి అనుకుంటున్నారో అటువంటివారు, తమ బిడ్డింగ్ ధరను rx100auction@gmail.com మెయిల్ అడ్రస్ కు మెయిల్ చేయవలసి ఉంటుంది. లేదా 9100445588 అనే ఫోన్ నెంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా తమ బిడ్డింగ్ ధరను పంపని కోరుతోంది. కాగా ప్రస్తుతం విరాళం కోసం ఈ మూవీ టీమ్ చేపట్టిన ఈ వెరైటీ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది….