షాక్.. అరటి పండులో రూ.45 లక్షలు..!

Wednesday, February 1st, 2017, 09:30:08 PM IST

banana
బంగారాన్ని, డ్రగ్స్ ని అక్రమంగా విచిత్రమైన పద్ధతుల్లో తరలించడం మనం చూశాం. డబ్బుని కూడా వివిధ మార్గాల్లో అక్రంగా తరలిస్తున్నారు. అరటిపండ్లలో రూ 45 లక్షలను తరలిస్తుండగా కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులు తమ చెక్ ఇన్ లగేజీలో అరటిపండ్లలో రూ 45 లక్షలు దాచి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అరటిపండు లో లోపలి భాగాన్ని తీసేసి డబ్బుని వుండ గా చుట్టి అందులో దాచారు.

ఎవరికీ అనుమానం రాకుండా తరలించాలనుకున్న వీరిద్దరూ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు.సౌదీ కరెన్సీ అయిన రియాల్స్ ను వారివిధంగా తరలిస్తున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.