అమరావతి భూములపై పవన్ పోరాటం చేయాలట..!

Thursday, March 3rd, 2016, 04:22:56 PM IST

roja
అమరావతి భూములపై వైకాపా ఎమ్మెల్యే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో భూదందా జరుగుతున్నదని.. భూములపై సీబిఐ విచారణ జరిపించాలని రోజా పేర్కొన్నది. లోకేష్ లో శేరిలింగంపల్లిలో భూములను దోచిపెట్టారని.. హైదరాబాద్ నుంచి అమరావతి వరకు భూదందా జరుగుతున్నదని రోజా విమర్శించింది. బినామీల పేరుతో భూములను తీసుకుంటున్నారని.. దీనిపై సీబీఐ విచారణ జరిపిస్తే నిజానిజాలు వెళ్ళడవుతాయని రోజాతెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీలకమని, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని రోజా తెలియజేసింది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ రాజధాని రైతుల భూముల విషయంలో ప్రశ్నించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ విషయంలో పవన్ మౌనంగా ఉంటె సరిపోదని..పవన్ మౌనంగా ఉన్నారు అంటే అది అనేక అనుమానాలకు తావునిస్తుందని రోజా పేర్కొన్నారు.