భారీ మెజారిటీతో గెలిచి కీలకమైన పదవి చేపట్టిన రోజా భర్త

Monday, July 22nd, 2019, 10:20:40 AM IST

వైసీపీ పార్టీ తరుపున గెలిచిన రోజాకి వరసగా మంచి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పదవి వస్తుందని రోజాకి ఆ పదవి రాకపోవటం కొంచం నిరాశ కలిగించే విషయం, అయితే ఆమెకి మరో పదవి ఇచ్చి జగన్ ఆమెలో కలిగిన అసంతృప్తిని చల్లపరిచాడు. ఇక ఆమె భర్త ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి కి కూడా అనుకోని విధంగా ఒక పదవి లభించింది.

తమిళనాడు దర్శకుల సంఘానికి అతను అధ్యకుడిగా ఎన్నికయ్యాడు. ప్రతి రెండేళ్లకి ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఆర్కే సెల్వమణి నిలబడి బంపర్ మెజారిటీతో గెలిచాడు. గత అధ్యక్షుడి పదవి కాలం ఈ నెలాఖరుకి ముగిసిపోతుంది. దీనితో తమిళ దర్శకులు అందరు కలిసి భారతీరాజాని ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఆయన రాజీనామా చేశాడు. దీనితో ఎన్నికలు అనివార్యంగా మారిపోయాయి.

దీనితో ఆర్కే సెల్వమణి మరియు విద్యాసాగర్‌ పోటీచేయగా 2,700 మంది సభ్యులు ఉండే ఆ సంఘంలో 1508 ఓట్లు పోలయ్యాయి. ఒక్క సెల్వమణికే 1386 ఓట్లు వచ్చాయి, ఆయన మీద పోటీచేసిన విద్య సాగర్ కి 100 దాక మాత్రమే రావటంతో ఆర్కే సెల్వమణి తమిళ్ దర్శకుల సంఘానికి నూతన అధ్యక్షడిగా నియమింపబడ్డాడు. ఇక తన భర్తకి ఆ పదవి రావటంతో రోజా ఫుల్ హ్యాపీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక నెలలోనే భార్యాభర్తలకి తమ తమ స్థాయికి తగ్గ పదవులు వరించటం విశేషమే..