వీడియో : వర్మ వెటకారానికి జయమాలిని స్టెప్పులేస్తే ఇలా ఉంటుంది..!

Friday, November 17th, 2017, 11:00:48 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులఫై మీడియా ఛానళ్లలో రచ్చ జరుగుతుంటే, సోషల్ మీడియాలో పెద్ద రగడ జరుగుతోంది. వివాదాలంటే ఎప్పుడూ ముందుండే వర్మ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సంచలనంగా మారుతోంది. చాణిక్య చంద్రగుప్త సినిమాలోని జయమాలిని స్టెప్పులేసిన పాటకు వర్మ వెటకారంగా రూపొందించిన పాటని జత చేశారు. ‘ఒకటా రెండా తొమ్మిదీ.. మరి ఒకటే నేను నందిని’ అంటూ సాగె ఈ పాట నెట్ లో వైరల్ గా మారింది.

తెలుగుదేశం ప్రభుత్వం పై సెటైర్లు పేలేలా వర్మ ఈ పాటని రూపొందించారు. అంకెలు చూస్తే తొమ్మిది మా కోరిక మాత్రం కమ్మది అంటూ సాగే సెటైర్లు ఈ పాటలో ఉన్నాయి. గతంలో కూడా ‘క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అప్ప‌ల‌రాజు’ అనే చిత్రంలో నంది అవార్డులపై వర్మ సెటైర్లు పేల్చారు. గుర్రం అవార్డుల పేరుతో నంది అవార్డుపై సెటైర్లు వేసేలా అందులో ఓ సీన్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ కు ఎలాంటి కౌంటర్ లు వస్తాయో చూడాలి.