కేసీఆర్ ను నిలదీసే శక్తి అక్కడి ప్రజలకు ఉందట..?

Thursday, October 8th, 2015, 02:16:36 AM IST

Revanth-Reddy
తెలంగాణాలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తాజాగా వరంగల్ కలెక్టరేట్ వద్ద టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో తెలంగాణా టీడీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణా ద్రోహులకు సీఎం కేసీఆర్ తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ ను పాతిపెట్టాలని, సీఎం కేసీఆర్ ను నిలదీసే శక్తి వరంగల్ ప్రజలకు ఉందని అన్నారు. అలాగే తన కేబినేట్ లో తెలంగాణా కోసం ఏనాడు పోరాడని వారికి మంత్రి పదవులిచ్చిన కేసీఆర్ అదే తెలంగాణా కోసం పోరాటం చేసిన కోదండరాంను మాత్రం ఒంటరిని చేశాడని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఉద్యమకారులపై రాళ్లు వేసిన కొండా సురేఖ సీఎం కేసీఆర్ కు ఆప్తులయ్యారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.