రేవంత్ ను అక్కడే ఉంచండి!

Monday, June 8th, 2015, 10:26:49 PM IST


తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యి విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డికి సరైన వసతులు కల్పించడం లేదంటూ అతని తరపు న్యాయవాది చేసిన ఆరోపణలను సిట్ అదనపు కమీషనర్ స్వాతి లక్రా ఖండించారు. అలాగే రేవంత్ రెడ్డికి సిట్ కార్యాలయంలో మంచి భోజనం, మినరల్ వాటర్, శుభ్రంగా పడుకోవడానికి కొత్త బెడ్ షీట్లు, బెడ్లు ఏర్పాటు చేశామని, అన్ని సౌకర్యాలను కల్పించామని స్పష్టం చేశారు.

కాగా రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి కూడా సిట్ కార్యాలయంలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇక సదుపాయాలు లేని కారణంగా అతనిని చర్లపల్లి జైలుకు తరలించాలన్న రేవంత్ తరపు న్యాయవాదుల వాదనను కోర్టు కొట్టివేసింది. అలాగే రేవంత్ కు తగిన వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని కోర్టు ఆజ్ఞ్యలు జారీ చేసింది.