సచిన్ కి, జమ్మూ-కాశ్మీర్ సిఎంకి మధ్య సంబంధం ఏమిటి?

Wednesday, November 6th, 2013, 02:00:25 AM IST

Sachin-tendulkar-and-Jammu-
క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్డుల్లాకి మధ్య సంబంధం ఏమిటి? అని అడుగుతున్నారు, అసలు వీరిద్దరి మధ్య సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఇక ఆ ఆలోచనల్ని ఆపేయండి అలాగే ఎవరన్నా నెగటివ్ గా అనుకుంటే ఇక వాటికి తెర దించేయండి. ఈ నవంబర్ 28న సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఓమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.

‘ నాకు సచిన్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం టీంలో సచిన్ లేని లోటు నిండుగా కనిపిస్తోంది. మన టీం ఇండియా మ్యాచ్ గెలుస్తున్నా సచిన్ లేని లోటు కనపడుతోంది. నాకు సచిన్ తో ఉన్న రెండు సంబంధాలు జీవితాంతం గుర్తుంటాయి. అందులో ఒకటి నా కుమారుడు, సచిన్ కుమార్తె ఒకే రోజు, ఒకే హాస్పిటల్ లో ముంబైలో జన్మించారు. తన కొడుకు జన్మదినాన్ని నమోదు చేసుకోవడానికి వెళితే క్యూ లైన్ లో సచిన్ ముందు ఉన్నాడు. అప్పుడు నాకు సచిన్ కృతఙ్ఞతలు చెప్పారు. అలాగే నేను విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడికి టెస్ట్ మ్యాచ్ ఆడటానికి వచ్చిన సచిన్ కలుసుకున్నానని’ ఒమర్ అబ్దుల్లా అన్నారు.

అలా తనకు సచిన్ తో ఉన్న సంబందాన్ని, సచిన్ పై ఉన్న అభిమానాన్ని మీడియాతో పంచుకున్నారు.