ఇంత ధైర్యం చరణ్ కి ఎలా వచ్చింది..?

Saturday, November 19th, 2016, 05:57:40 PM IST

druva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నతాజా చిత్రం ధృవ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘ తనిఒరువన్’ కు రీమేక్ గా ఈ చిత్రం రాబోతోంది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ఈ చిత్రం లో రామ్ చరణ్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 9 న ఈ చిత్రాన్ని విడుదలకు ముస్తాబు చేస్తున్నారు.

రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడంటూ కామెంట్స్ మొదలైపోయాయి.దేశవ్యాప్తంగా కరెన్సీ బ్యాన్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అందరూ సినిమా చూసే పరిస్థితి లేదని అంటున్నారు.ఇటువంటి సమయంలో ఒక పెద్ద చిత్రాన్ని విడుదల చేయాలనుకోవడం సాహసంతో కూడుకున్న నిర్ణయమని సినీ అభిమానులు అంటున్నారు. ఈ సమయం లో క్లిష్ట పరిస్థితులని తట్టుకుని ధృవ చిత్రం ఎలాంటి వసూళ్లని రాబడుతుందనేది ఆసక్తికర అంశమని అంటున్నారు.కాగా ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.