రామ్ చరణ్ విమానాలు వచ్చేస్తున్నాయి!

Tuesday, May 5th, 2015, 09:59:23 AM IST


హైదరాబాద్ నుండి తెలుగు రాష్ట్రాలలో విమానాశ్రయాలు ఉన్న అన్ని చిన్న పట్టణాలకు, దక్షినాది నగరాలకు విమాన సర్వీసులు అందించేందుకు టర్బో మేఘా ఎయిర్ వేస్ చేస్తున్న సన్నాహాలు ముగింపు దశకు వచ్చాయి. ఈ మేరకు వచ్చే నెల జూన్ నుండే ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే ఉమేశ్ వంకయలపాటి నేతృత్వంలో కొత్తగా సేవలు ప్రారంభిస్తున్న ఈ కంపెనీలో ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు అయిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు, టాలీవుడ్ మగధీరుడు రామ్ చరణ్ తేజ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

అలాగే రామ్ చరణ్ కంపెనీ బోర్డు డైరెక్టర్లలో ఒకరిగా ఉంటూ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నారు. కాగా ఈ సంస్థకు త్వరలోనే డీజీసీఏ అనుమతులు లబించనున్నాయని ఉమేశ్ తెలిపారు. ఇక అనుమతులు రాగానే విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ఉమేశ్ స్పష్టం చేశారు.