మహేష్ పక్కన చాన్స్ కొట్టేసిందా?

Tuesday, April 21st, 2015, 12:22:29 PM IST

rakul-preet-singh
ఇటీవల టాలీవుడ్ లో విపరీతంగా వినిపిస్తున్న పేరు రకుల్ ప్రీత్ సింగ్. ఇక వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెరంగేట్రం చేసిన ఈ నటి కేవలం రెండేళ్లలో స్టార్ నటుల పక్కన నటించే అవకాశం దక్కించుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఇప్పటి వరకు గోపీచంద్, మనోజ్, రామ్ వంటి యువహీరోల పక్కన నటించి, రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల పక్కన చాన్స్ కొట్టేసిన ఈ ఢిల్లీ భామ ఇప్పుడు ప్రిన్స్ మహేష్ పక్కన నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇక మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో హీరోయిన్ గా రకుల్ ఎంపికైనట్లు సమాచారం. కాగా మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ఖాయమైనట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పేరు వార్తల్లోకి వస్తోంది. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. మరి అదే గనుక నిజమైతే మహేష్ పక్కన సమంతా, రకుల్ కలిసి నటించనున్నారు. ఒకవేళ గనుక ఒకే కధానాయకి ఉన్నట్లయితే సమంతా తప్పుకుని రకుల్ ఉండబోతోందో లేదా రకుల్ నే తప్పించి సమంత ఆ స్థానాన్ని దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే.