సమంతాపై సెటైర్ వేసేసింది!

Saturday, April 18th, 2015, 11:35:32 AM IST

rakul-preet-singh-comments-
ప్రముఖ టాలీవుడ్ నటి సమంతపై మరో అప్ కమింగ్ ఫేమస్ తార రకుల్ ప్రీత్ సింగ్ సెటైర్ వేసింది. కాగా సమంత చాలా చక్కగా రిబ్బన్ కత్తిరిస్తుంది అంటూ రకుల్ ప్రీత్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల కాలంలో సమంత చాలా వస్త్ర దుకాణాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, ఎక్కడ కొత్త బ్రాంచ్ పెట్టినా సరే ఓపెనింగ్ సెర్మనీకి హాజరవుతూ కత్తెర పట్టుకుని ప్రారంభ కార్యక్రమాలను చకచకా చేసేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్య కాలంలో సమంత చేతిలో అంతగా పెద్ద సినిమాలు లేకపోవడం, టాలీవుడ్ లో అయితే దాదాపు అవకాశాలు తగ్గడం మూలంగా సమంత ఈ ఓపెనింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక అదే సమయంలో కొత్త నటి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో అవకాశాల మీద అవకాశాలను చేజిక్కించుకుంటూ, విజయాలను సాధిస్తూ తారాపధంలో ముందుకు దూసుకుపోతోంది. మరి ఈ నేపధ్యంగా ‘సమంతా బాగా రిబ్బన్ కత్తిరిస్తుంది’ అంటూ రకుల్ చేసిన ప్రశంశ ముమ్మాటికీ సమంతపై సెటైరేనని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.