2.0 మూవీ.. ఫ‌స్ట్ రివ్యూ అవుట్.. రిపోర్ట్ మీరే చూడండి..!

Wednesday, November 28th, 2018, 04:44:12 PM IST

ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్ పై రికార్డులు క్రియేట్ చేయ‌డానికి మ‌రో చిత్రం న‌వంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సూపర్‌స్టార్ ర‌జినీకాంత్, సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం 2.0. 550 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం, భారీ అంచ‌నాలతో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌డానికి వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్, ట్రైల‌ర్‌లు 2.0 ఓ గ్రాఫిక్స్ వండ‌ర్ అని తేల్చేశాయి. అంతే కాకుండా తెలుగు,త‌మిళ సెన్సార్ బోర్డు నుండి పాజిటీవ్ టాక్ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు తాజాగా 2.0 దుబాయ్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకోవ‌డంతో, ప్ర‌ముఖ క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు స‌భ్యుడ‌ని చెప్పుకునే ఉమైర్ సంధు 2.0 మూవీ ఎలా ఉందో తేల్చేశాడు. 2.0 సినిమా ప్లాట్ అమేజింగ్ అని, స్క్రీన్ ప్లే అయితే ప‌రుగులు పెట్టింద‌ని, ప్రేక్ష‌కుల‌కు త‌లతిప్పుకునే ప‌రిస్థితి లేద‌ని, యాక్ష‌న్ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయ‌ని, గ్రాపిక్స్ అయితే వండ‌ర్ అనేలా ఉన్నాయని చెప్పారు ఉమైర్ సంధు.

ఇక ర‌జినీ- అక్ష‌య్‌ల మ‌ధ్య వ‌చ్చే సీన్స్ అయితే ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఉన్నాయ‌ని, ఈ ఇద్ద‌రు త‌మ న‌ట‌న‌తో ప్రాణం పోశార‌ని, ఈ చిత్రంలో ప్ర‌తి ఒక్క సీన్‌ని డైరెక్ట‌ర్ శంక‌ర్ అద్భుతంగా డిజైన్ చేశార‌ని, రెహ‌మాన్ పాట‌ల‌తో పాటు పిక్చ‌రైజేష‌న్ సూపర్ అని, బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే మైండ్‌బ్లోయింగ్ అని చెప్పారు. ఇక చివ‌రిగా భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే 2.0 బెస్ట్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీగా నిల‌చిపోతుంద‌ని, ర‌జినీ అభిమానులు సంబ‌రాలు చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని ఉమైర్ సంధు తేల్చేశాడు. మ‌రి ఈ గురువార‌మే బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌డానికి వ‌స్తున్న 2.0 ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.