ఆస్కార్ బరిలో రెహ్మాన్ !

Sunday, December 14th, 2014, 09:50:28 AM IST


ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. రెహ్మాన్ సంగీతం సమకూర్చిన మూడు చిత్రాలు ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో పోటీపడుతున్నాయి. 87వ ఆస్కార్ అవార్డుల తుది జాబితాను వచ్చే సంవత్సరం జనవరిన 15న ప్రకటిస్తారు. ఇక ఫిబ్రవరి 22న అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.

2009వ సంవత్సరంలో స్లమ్ డాగ్ మిలినియర్ చిత్రానికిగాను ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో రెండు అవార్డులు లభించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు..ఆయన సంగీతం అందించిన మిలియన్ డాలర్ ఆర్మ్, ది హండ్రెడ్ ఫుట్ జర్నీ, కొచ్చాడియన్ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. అయితే… ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో మొత్తం 114 చిత్రాలు పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది.