దళితుడు కావడమే అతని నేరమా?

Saturday, July 4th, 2015, 09:32:36 AM IST

raghuveera-reddy-congress
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డిని వదిలేసి, తెలిసో, తెలియకో సైనికులపై విమర్శలు చేసిన దళిత ఎంపీ రవీంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటీసులు ఇవ్వడమేమిటని తప్పు పట్టారు. అలాగే చంద్రబాబు అక్రమర్కులకే అండగా ఉంటారన్న విషయం మరోసారి వెల్లడించారని రఘువీరా మండిపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ దళితుడైన అమలాపుర ఎంపీ రవీంద్రబాబుకు నోటీసులు జారీ చెయ్యడం చంద్రబాబుకు దళితుల పట్ల ఉన్న వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ఓటుకు నోటు ఆరోపణల నుండి తప్పించుకునేందుకు చద్రబాబు సెక్షన్ 8 ను అడ్డుపెట్టుకుని విద్యార్ధి, ఉద్యోగ వర్గాలను రెచ్చగొడుతున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. ఇక ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ల వ్యవహారంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అందరిపైనా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.