9 మందికి మోడీ ఛాలెంజ్ – స్వీకరించిన ప్రియాంక

Thursday, October 2nd, 2014, 06:00:12 PM IST

priyanka-and-modi
స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఏడాదికి వంద రోజులు పాల్గొన్నవలసిందిగా ప్రజలకు మోడీ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బాలీవుడ్ స్టార్ లను కూడా ఆయన ఆహ్వానించారు. ఈమేరకు ఆయన సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ , ప్రియాంకా చోప్రా తో పాటు శశిథరూర్, సచిన్ టెండుల్కర్, తారక్ మెహతా, అనీల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ లకు చాలెంజ్ విసిరారు. తన పిలుపుతో ఈ కార్యక్రమంలోకి వచ్చి, తలా మరో తొమ్మిది మందిని పిలవాలని మోడీ వారిని కోరారు.

ప్రధాని మోడీ ఛాలెంజ్ ని ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా స్వీకరించింది. ప్రధాని చేపట్టిన కార్యక్రమానికి తన మద్దతు తెలిపింది. ప్రధాని ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నానని, ఇది చాలా గొప్ప ఆలోచనగా ప్రియాంక తన ట్విట్టర్ లో రాసింది.