2019కి సిద్దం కావాలంటోన్న కెసిఆర్

Saturday, January 17th, 2015, 11:00:51 AM IST


2019లో జరిగే జనరల్ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్దం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం కృషి చేసిన వారిని పార్టీ ఎప్పటికీ మర్చిపోదని, వారికి తప్పకుండ పార్టీ ఎప్పుడు ఏమి చేయాలో అది చేస్తుందని కెసిఆర్ అన్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారిని ఇముడ్చుకోవలసిన అవసరం ఉన్నదని అన్నారు. పార్టీలో నాయకులు ఓపికగా ఉండాలని ఆయన సూచించారు. పార్టీలో చేరేందుకు ఇంకొంత మంది చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. త్వరలోనే సనత్ నగర్ కు ఉపఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ మరియు ఖమ్మం త్వరలో జరగబోతున్న తరుణంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయవలసిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. ఇక ఏప్రెల్ 27న జరిగే పార్టీ వార్షికోత్సవ నిర్వాహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వివిధ నాయకులతో చర్చలు జరిపారు. పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు నాయకులు సిద్దం కావాలని ఆయన పిలుపనిచ్చారు. 2019లో జనరల్ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్దం కావాలని ఆయన సూచించారు.