చంద్రబాబు దత్త పుత్రుడు వెడ్స్ కేసీఆర్ దత్త పుత్రిక ..?

Thursday, May 12th, 2016, 10:40:07 AM IST

reddy-pratusha
ఈ మధ్యకాలంలో కేసీఆర్ విషయంలో ప్రధానంగా హైలెట్ అవుతున్న అంశం ఆయన దత్త పుత్రిక ప్రత్యూష ప్రేమ వివాహం. తల్లిదండ్రుల చేతిలో చిత్ర హింసలు అనుభవించి అ తరువాత బయటపడి ప్రస్తుతం సీఎం పర్యవేక్షణలో ఉన్న ప్రత్యూష కర్నూలు జిల్లా వాసి మద్దిలేటి రెడ్డిని ప్రేమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో పరిచయమైన ఇతగాడిని ప్రత్యూష ప్రేమించింది. దీంతో ప్రత్యూష ప్రస్తుతం తానుంటున్న శిశు సంక్షేమ అధికారులతో ప్రేమించిన మద్దిలేటి వివాహం జరపాలని పట్టుబట్టింది.

మరోవైపు మద్దిలేటి రెడ్డి కూడా తానూ ప్రత్యూషను బాగా చూసుకుంటానని, కేసీఆర్ గారే దగ్గరుండి వివాహం జరపాలని, ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా కలుగజేసుకోవాలని కోరాడు. అలాగే బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు కూడా కేసీఆర్ ప్రత్యూషను దత్తత తీసుకుని తన గొప్ప మనసుని చాటుకున్నారు. అదే విధంగా చంద్రబాబుగారు కూడా పెద్ద మనసు చేసుకుని మద్దిలేటి రెడ్డిని దత్తత తీసుకుని దగ్గరుండి వివాహం జరపాలని కోరారు. దీంతో అందరూ చంద్రబాబు దత్త పుత్రుడు వెడ్స్ కేసీఆర్ దత్త పుత్రిక అన్నమాట అని అనుకుంటున్నారు.