జానా రెడ్డి పై పొన్నాల సంచలన వ్యాఖ్యలు.. టి-కాంగ్రెస్ లో ఆగని కుమ్ములాట !

Tuesday, August 30th, 2016, 03:00:40 AM IST


కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టిఆర్ ఎస్ కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణా కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి.తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యనేత పొన్నాల లక్ష్మయ్య బహిరంగంగానే జానారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఓ టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జానారెడ్డి పై పొన్నాల స్పందించారు. జానారెడ్డి టిఆర్ ఎస్ ను సమర్ధించడం పార్టీకి ఇబ్బందికర పరిణామమని ఆయన అన్నారు.

మహారాష్ట్ర ఒప్పందం పై తానూ కేసీఆర్ ను సవాల్ చేస్తున్నానని, ఈ విషయం లో తెలంగాణా అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని తెలిపారు.కేసీఆర్ మహారాష్ట్ర తో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అరగంటలో రావాలని అనగానే.. మేం పరిగెత్తుకుని వెళ్లాలా అని ప్రశ్నించారు.2019 నాటికి పార్టీ చీఫ్ గాఎవరున్నా కలసి పనిచేస్తామని పొన్నాల తెలిపారు. 2019 లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.